Google Assistantలో చిన్నారుల ఫీచర్‌ల నుండి ఆడియో సేకరణకు సంబంధించిన గోప్యతా ప్రకటన

Google Assistant ద్వారా, 'ఇంటిల్లిపాదీ ఉపయోగించగల Assistant చర్యలు' లేదా 'YouTube Kids వీడియోలు' వంటి చిన్నారుల ఫీచర్‌లను వ్యక్తులు ఉపయోగించినప్పుడు, వాయిస్, ఆడియో సమాచారాన్ని మేము ఎలా సేకరిస్తామో అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులకు మేము సహాయపడాలని అనుకుంటున్నాము. Google గోప్యతా పాలసీలో అందించిన సమాచారంతో పాటుగా, ఈ గోప్యతా ప్రకటన కూడా Google Assistantలో ఈ ఫీచర్‌ల వినియోగానికి వర్తిస్తుంది.

ఏదైనా దేశంలోవర్తించే వయోపరిమితిలోపు ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు వారి Google ఖాతాను Family Linkతో క్రియేట్ చేసినట్లయితే, ఆయా చిన్నారులు తమ ఖాతాలను Google Assistant ఎనేబుల్ చేయబడిన దాదాపు అన్ని డివైజ్‌లకు లింక్ చేయగలరు. వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్‌లోని "ఆడియో రికార్డింగ్‌లను చేర్చండి" ఆప్షన్ ద్వారా, మీరు Assistantతో ఇంటరాక్ట్ అవ్వడానికి మీ వాయిస్‌ను ఉపయోగించినప్పుడు, వాయిస్, ఆడియోల రికార్డింగ్‌లు మీ Google ఖాతాలో స్టోర్ చేయబడతాయా లేదా అని ఈ ఆప్షన్ కంట్రోల్ చేస్తుంది. Google ఖాతాను క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ఆటోమేటిక్‌గా ఆఫ్‌లో ఉంటుంది, దీని కోసం Assistantను ఉపయోగించాల్సిన అవసరం లేదు. 'వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్‌లో మీ పిల్లల "వాయిస్, ఆడియో రికార్డింగ్‌లను చేర్చండి" ఆప్షన్‌ను ఎంచుకున్నట్లయితే, వారు సైన్-ఇన్ చేసిన డివైజ్‌లో, Assistantతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వారి మాటల రికార్డింగ్‌తో పాటు, అంతకు ముందు కొన్ని సెకన్ల పాటు ఉన్న ఆడియో, వారి ఖాతాలో స్టోర్ చేయబడవచ్చు.

మీరు Family Linkతో మీ చిన్నారి కోసం కొత్త ఖాతాను క్రియేట్ చేసి ఉంటే, మీ చిన్నారి Google ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా వారి ఆడియో రికార్డింగ్‌లను మీరు యాక్సెస్ చేయవచ్చు, అప్‌డేట్ చేయవచ్చు, తీసివేయవచ్చు, అలాగే ఎగుమతి చేయవచ్చు. మీ చిన్నారికి చెందిన ఖాతా పాస్‌వర్డ్ మీకు గుర్తు లేకపోతే, Family Link యాప్ ద్వారా లేదా వెబ్‌లో Family Link సెట్టింగ్‌ల ద్వారా మీరు దానిని రీసెట్ చేయవచ్చు. ఒకసారి సైన్ ఇన్ చేసిన తర్వాత, Google గోప్యతా పాలసీలో వివరించిన కంట్రోల్స్‌ను ( Google యాక్టీవిటీ కంట్రోల్స్ వంటివి) ఉపయోగించి, మీ చిన్నారి ఖాతాలో స్టోర్ అయిన ఏ యాక్టివిటీని అయినా తొలగించడంతో సహా, వారి ఆడియో రికార్డింగ్ యాక్టివిటీ సెట్టింగ్‌లను, వారి ఖాతాలో స్టోర్ అయిన ఆడియో రికార్డింగ్‌లను మేనేజ్ చేయవచ్చు.

మీ దేశంలో వర్తించే 'కనీస వయో అర్హత' నిబంధన మారక ముందు, మీ చిన్నారి స్వంతంగా ఒక ఖాతాను క్రియేట్ చేసి, ఆ తర్వాత తమ ఖాతాను కొనసాగించడానికి వారికి మీరు అనుమతిని మంజూరు చేసి ఉంటే, వారి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి, లేదా వారి ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి, మీకు మీ చిన్నారి అనుమతి కావాల్సి రావచ్చు.

ఆడియో రికార్డింగ్‌లను చేర్చవచ్చు అని సమ్మతించిన, "Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతా" లేకుండా 'ఇంటిల్లిపాదీ ఉపయోగించగల Assistant చర్యలు' లేదా YouTube Kids వీడియోలు వంటి చిన్నారుల ఫీచర్‌లను Google Assistantలో మీరు ఉపయోగించి ఉంటే, ఆ ఇంటరాక్షన్‌లకు సంబంధించిన వాయిస్, ఆడియోల రికార్డింగ్‌లను మేము క్లుప్తంగా సేకరిస్తాము. ఆడియో ఫీచర్‌ను ఉపయోగించి, ఆ ఇంటరాక్షన్‌ను పూర్తి చేసేందుకు అవసరమైన మేరకు, ఈ సమాచారం ప్రాసెస్ చేయబడుతుంది, ఆ తర్వాత వెంటనే తొలగించబడుతుంది.

చివరిగా సవరించిన తేదీ: సెప్టెంబర్ 2, 2021